ఏపీని ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఏపీ’ గా ప్రకటించండి.. పవన్ కల్యాణ్ ఎద్దేవా

ఏపీలో మూడు రాజధానుల అంశం హీటెక్కిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీని ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర’గా ప్రకటించాలని ఎద్దేవా చేశారు. వికేంద్రీకరణే సర్వతోముఖాభివృద్ధికి మంత్రమని వైసీపీ భావిస్తే.. ఏపీని మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలి? 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి, 25 రాజధానులను ఏర్పాటు చేయాలని ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు. చట్టం, న్యాయ వ్యవస్థకు, రాజ్యాంగానికి అతీతంగా అన్నట్లుగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు.

 

ఆంధ్రప్రదేశ్‌ ను కూడా “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర”గా ప్రకటించండి. 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులకు వెళ్లండి. ఏపీని మీ వైసీపీ రాజ్యంగా మార్చుకోండి. దయచేసి సంకోచించకండి. వికేంద్రీకరణ సర్వతోముఖాభివృద్ధికి మంత్రమని వైసీపీ భావిస్తే ఏపీకి మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలి?. ఏది ఏమైనప్పటికీ వైసీపీ చట్టం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్లు విశ్వసిస్తారు, ప్రవర్తిస్తారు. మిగిలిన పౌరులు ఏమి భావిస్తున్నారో లేదా చెప్పేదానిని వారు ఒక్క పైసా కూడా పట్టించుకోరు’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.

 

 

ఇక… యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలోని దక్షిణ డకోటాలోని ‘‘మౌంట్‌ రష్‌మోర్’’ చిత్రాన్ని కూడా జనసేనాని పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ- విశ్వాసాలకు ‘‘మౌంట్‌ రష్‌మోర్’’ చిహ్నంగా అభివర్ణించారు. విశాఖ జిల్లాలోని రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ “మౌంట్‌ దిల్‌ మాంగే మోర్‌”.. “ధన – వర్గ – కులస్వామ్యానికి చిహ్నం” పీఎస్‌ (బూతులకి కూడా…) అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Related Posts

Latest News Updates