ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి భారతీయుల మనసులను దోచ్చుకున్నారు. గణేష్ చతుర్థి నాడు వినూత్నమైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి ముందు చేతులు జోడిరచి ప్రార్థిస్తున్నట్లు డిజైన్ చేసిన ఫోటోను పోస్ట్ చేశారు. నా స్నేహితులందరికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానని కామెంట్ జోడిరచారు. వార్నర్ చేసిన ఈ పోస్ట్‌కు భారతీయుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.
గతంలో సినిమా పాటలకు డ్యాన్స్ వేయడం, పాపులర్ డైలాగ్స్‌కు మీమ్స్ చెప్పడం లాంటివి చేసి సోషల్ మీడియాతో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న వార్నర్ భాయ్ తాజాగా చర్యతో భారతీయులకు మరింత చేరువయ్యాడు. ఐపీఎల్ ద్వారా తెలుగు ప్రజలతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న వార్నీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా ఆ బంధాన్ని మరింత బలపరుచ్చుకున్నాడు. వార్నర్ పోస్టుకు తెలుగు ప్రజల నుంచి అధికమైన రెస్పాన్స్ వస్తుండటమే ఇందుకు నిదర్శనం.