భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షమందికి పైగా మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాగా వారిలో 65 శాతం మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ను సెప్టెంబర్ 1న విడుదల చేశారు. గర్భాశయ క్యాన్సర్ 90 శాతం ఒకే ఒక నిర్ధిష్ట వైరస్ వల్ల వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ రూపొందించిన ఈ వ్యాక్సిన్ ఆ వైరస్‌కి వ్యతిరేకంగా పనిస్తుందట. సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ గర్భాశయ క్యాన్సర్లను నిరోధించే వ్యాక్సిన్ ని రూపొందించింది. గర్భాశయ క్యాన్సర్‌కి వ్యతిరేకంగా మనదేశంలో వ్యాక్సిన్ తయూరు చేసే బాధ్యతను డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జులై నెలలో సీరం ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఢల్లీిలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ వ్యాక్సిన్‌ని ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ రాకతో భారతదేశ వైద్య శాస్త్రంలో ఒక మైలురాయి సాధించినట్లు ఆయన తెలిపారు. గర్భాశయ క్యాన్సర్‌కి వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్‌ను మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు.