కర్నాటక బీజేవైఎం నేత ప్రవీణ్ నెట్టారు మర్డర్ కేసులో ఎన్ఐఏ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కర్నాటకలోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ప్రవీణ్ నెట్టారు మర్డర్ కి సంబంధించి, ఎన్ఐఏ 33 చోట్ల సోదాలు నిర్వహించింది. మైసూరు, కొడుగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు చేశారు. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొనే… పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు ప్రవీణ్ నెట్టారును హత్య చేశారని ఎన్ఐఏ తన దర్యాప్తులో పేర్కొంది. ప్రవీణ్ నెట్టారు హత్య చేసిన వారికి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సోదాల్లో అనుమానితుల ఇళ్ల నుంచి పరికరాలు, మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
ప్రవీణ్ నెట్టారు తన దుకాణాన్ని మూసేసి, తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో జూలై 26 న బెల్లారేలో దుండగులు బైక్ వచ్చి ఆయన్నునరికి చంపారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్లారే పోలీస్ స్టేషన్ లో హత్య కేసుగా నమోదైంది. నిందితులను అరెస్ట్ చేయాల్సిందేనని బీజేపీ కార్యకర్తలు తీవ్ర నిరసనలు చేశారు. దీంతో బొమ్మై ప్రభుత్వం ఈ కేసును ఎన్ఐఏకి బదీలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.