కృష్ణంరాజు మృతి తీవ్రంగా కలిచివేసింది : నాట్స్ ప్రకటన

మనసున్న మారాజు కృష్ణంరాజు ఇక లేరనే వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఒక ప్రకటనలో తెలిపింది. వెండితెరపై ఆయన పోషించిన పాత్రలు తెలుగువారు ఎప్పటికి మరిచిపోలేరని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి పేర్కొన్నారు. తెలుగుజాతికి ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా.. ఉన్నత విలువలు ఉన్న వ్యక్తిగా, ప్రజలకు నిస్వార్థంగా సేవలందించిన రాజకీయ నాయకుడిగా కృష్ణంరాజు తెలుగువారికే ఓ స్ఫూర్తిలా నిలిచారని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి  తెలిపారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తమ సంస్థ తరపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.

Related Posts

Latest News Updates