పార్ట్ టైమ్ చేసే వారిపై కఠిన చర్యలుంటాయ్… ఉద్యోగులను హెచ్చరించిన ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్ సంస్థ తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తూ మెయిల్స్ పంపింది. ఎవరైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నట్లు తేలితే… వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ హెచ్చరించింది. కంపెనీ నియమాలను ఉల్లంఘించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడానికి కూడా వెనుకాడమని తేల్చి చెప్పింది. డ్యూయల్ ఎంప్లాయిమెంట్ అనేది సంస్థ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావమే చూపిస్తుందని, దీని వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని సంస్థ తన మెయిల్ లో ప్రకటించింది.

 

తమ అనుమతి లేకుండా ఎవరైనా ఇతర కంపెనీల్లో పార్ట్ టైమ్ లేదా భాగస్వామిగా వున్నా… నేరమని ఇన్ఫోసిస్ ప్రకటించింది. కరోనా కారణంగా అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. వర్క్ ఫ్రం హోమ్ చేస్తూనే… ఇతర కంపెనీలకు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా చాలా మంది చేశారు. ఈ నేపథ్యంలోనే ఇన్ఫోసిస్ పై హెచ్చరికలు చేసింది.

Related Posts

Latest News Updates