ఆలశ్యమైనా మా చిత్రాన్ని థియేటర్ లలో మాత్రమే రిలీజ్ చేస్తాం : ముల్లేటి నాగేశ్వ‌రావు, నిర్మాణ సారధి

రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్, జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ పై హుషారు, షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాలలో న‌టించిన తేజ్ కూర‌పాటి సోలో హీరోగా , అఖిల ఆక‌ర్ష‌ణ హీరోయిన్ గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”. ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే థియేటర్స్ కొరత కారణంగా ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు  ముల్లేటి నాగేశ్వ‌రావు, ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు మరియు డాక్టర్, MR Chowdary గారు మాట్లాడుతూ..ఈ   ఈ నెల సెప్టెంబర్ 2  న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దాం అనుకున్నాము. కాని మేము అనుకున్న theatres మాకు అందుబాటులో లేకపోవడం వల్ల సినిమా నీ వాయిదా వెయ్యడం జరిగింది , ప్రేక్షకులు ఈ సినిమా నీ అభిమానించి మా ట్రెయిలర్ నీ లక్షల సంఖ్యలో లైక్ లు కొట్టిన ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని క్షేమించగలరు , తదుపరి సినిమా రిలీజ్ డేట్ నీ త్వరలో ప్రకటిస్తామని తెలియజేస్తున్నాము, మంచి కంటెంట్ తో ఉన్న మా సినిమా నీ ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని మంచి theatres లో సినిమా నీ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం

Related Posts

Latest News Updates