మునుగోడు ఉప ఎన్నికల్లో తమ మద్దతు అధికార టీఆర్ఎస్ కే వుంటుందని తెలంగాణ సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. బీజేపీని ఓడించడానికే తాము టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీలు కూడా తమకే సపోర్ట్ చేయాలని తమని కోరాయని, అయితే… బీజేపీని ఓడించే శక్తి టీఆర్ఎస్ కే వుందని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే… అభివృద్ది కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్ చెప్పడం కేవలం సాకు మాత్రమే అని విమర్శించారు.
రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బలమున్నా ..మూడో స్థానానికి పోతుందని జోస్యం చెప్పారు. అయితే… తాము తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఒక్క మునుగోడు ఉపఎన్నిక విషయంలో మాత్రమేనని తమ్మినేని క్లారిటీ ఇచ్చారు. మద్దతు ఇచ్చినంత మాత్రాన సమస్యలపై పోరాటాలు ఆగవని… సీఎం కేసీఆర్ ను కలిసి రాష్ట్ర సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.