అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కొద్ది మంది చేతుల్లోనే పదివేల ఎకరాల అమరావతి భూములు ఉన్నాయని విమర్శించారు. టీడీపీలో చాలా మంది నేతలు అక్కడ భూములు సేకరించారని మండిపడ్డారు. అమరావతి విషయంలో శివరామకృష్ణన్ రిపోర్టును చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశారని మండిపడ్డారు.
విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు అప్పట్లో కొందరు వస్తే అప్పటి ప్రభుత్వాలు తిరస్కరించాయని, టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్ మెంట్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కొందరి ఆస్తి విలువ పెంచేందుకు రాష్ట్రం మొత్తం పన్నులు కట్టాలా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బుగ్గన మండిపడ్డారు.