అసెంబ్లీ ఎక్కడ వుంటే… అదే రాజధాని : తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి

ఏపీలో పరిపాలన వికేంద్రీకరణపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగానే… అధికార వైసీపీకి కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. రాష్ట్ర రాజధాని విషయంలో ఏకంగా కేంద్ర మంత్రి మరోసారి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎక్కడ వుందో అదే రాష్ట్ర రాజధాని అని కేంద్ర మంత్రి నారాయణ స్వామి తేల్చి చెప్పారు. కేంద్రం నుంచి చాలా పనులు అనుమతులు పొంది, అమరావతిలో 40 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని అన్నారు. కేంద్ర మంత్రి నారాయణ స్వామి నేడు విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అమరావతి విషయంలో ఇంత జరిగిన తర్వాత కాదనడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య అమరావతి అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్ర రాజధానిని రాజకీయ పార్టీలు నిర్ణయించలేవని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

 

అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు, ధర్నాలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ ను చూసి ఉద్యమాలా? అంటూ ప్రశ్నించారు. జగన్ శాసనసభలో పాలన వికేంద్రీకరణపై సుధీర్ఘంగా ప్రసంగించారు. ప్రతి ప్రాంతం బాగుండాలన్నదే తమ అభిమతమని, అమరావతిపై తనకేమీ కోపం లేదని ప్రకటించారు. విశాఖలో రోడ్డు వున్నాయని, డ్రైనేజీ, విద్యుత్ వుందన్నారు. విశాఖపై తనకేమీ ఎక్కువ ప్రేమ లేదని, ప్రజలందరిపై ప్రేమ వుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. అమరావతికి లక్షల కోట్లు ఖర్చయ్యాయని, కేవలం 10 వేల కోట్లు పెడితే విశాఖ డెవలప్ అవుతుందన్నారు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం