జనసేన అసలు రాజకీయ పార్టీయే కాదు : బొత్స, అంబటి ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అధికార పార్టీ వైసీపీ విరుచుకుపడుతోంది. జనసేన అనేది అసలు రాజకీయ పార్టీయే కాదని, పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ వారికి లేవని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీలు మనకు అవసరమా? అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే పార్టీలన్నీ మాకు శత్రువులేనని తేల్చి చెప్పారు. జనసేన నేతలు మంత్రులపై దాడులకు దిగితే.. ఖండించాల్సింది పోయి.. చంద్రబాబు మద్దతిస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు.ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే నేత‌ల చొక్కాలు పట్టుకొని నిల‌దీయండి అంటూ బొత్స పిలుపునిచ్చారు.

 

ఇక… జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనపై మరో మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. విశాఖ ప్రశాంతంగా వుంటుందని పర్యాటకులు ఎక్కువ వస్తుంటారని, ఆ ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకొని, పవన్ ఇవన్నీ చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. చంద్రబాబు మాట చెప్పడానికే పవన్ విశాఖ పర్యటనకు వచ్చారని ఆరోపించారు. అసాంఘిక శక్తులను బాబు, పవన్ ప్రోత్సహిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని అంబటి హెచ్చరించారు.

 

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్