సుపరిపాలన, మెరుగైన సేవలను అందించేందుకు బ్యాంకింగ్ రంగం ఓ వాహకం : మోదీ

ఆర్థిక చేరిక, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు భారత దేశపు పురోగతిని ప్రస్తావిస్తూ దేశంలో సుపరిపాలన, మెరుగైన సేవలను అందించడానికి బ్యాంకింగ్ రంగం ఒక వాహకంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.  ఆర్థిక చేరికను ప్రోత్సహించే లక్ష్యంతో, ప్రధాని మోదీ ఆదివారం 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డిబియు) జాతికి అంకితం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కూడా వర్చువల్ మోడ్ ద్వారా ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు మరింత ఆర్థిక చేరికతో పాటు పౌరులకు బ్యాంకింగ్ అనుభవాన్ని గణనీయంగా మెరుగు పరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
డిబియులు సామాన్యుల జీవితాన్ని సరళీకృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయని చెబుతూ ఇవి  అనేది కనీస డిజిటల్ మౌలిక సదుపాయాలతో గరిష్ట సేవలను అందించే వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. “సామాన్యుల జీవితాలను సులభతరం చేయడానికి కొనసాగుతున్న ప్రచారంలో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ముఖ్యమైనవి. ఇది కనీస డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా గరిష్ట సేవలను అందించే ప్రత్యేక బ్యాంకింగ్ సదుపాయం. ఈ సేవలు కాగితపు పని, ఇతర అవాంతరాలు లేకుండా ఉంటాయి. వీటిలో సౌకర్యాలు ఉంటాయి. అలాగే బలమైన డిజిటల్ బ్యాంకింగ్ భద్రత” అని ఆయన చెప్పారు.

Related Posts

Latest News Updates