మరోసారి హిందువుల మనోభావాలను దెబ్బతీసే యాడ్ లో నటించవద్దని మధ్య ప్రదేశ్ హోమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆమీర్ ఖాన్ ను హెచ్చరించారు. హిందువుల మనోభావాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆమీర్ ఖాన్, కయారా అద్వానీ కలిసి ఓ యాడ్ లో నటించారు. ఇప్పుడు అది హిందువుల ఆగ్రహానికి గురైంది. సహజంగా సంప్రదాయం ప్రకారం ఇంటి కోడలు అత్తవారింటికి పెళ్లి చేసుకొని రాగానే… కుడి కాలు మొదట పెట్టి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కానీ… ఈ యాడ్ లో అమీర్ ఖాన్ అత్తవారింటికి వెళ్లి… తాను మొదట కుడి కాలు పెడతారు. దీంతో వివాదం రేగింది.
భారతీయ సంప్రదాయంలో కోడలిని అత్యంత పవిత్రంగా చూసుకుంటారని, కానీ అమీర్ ఖాన్ పద్ధతి ఏంటని పలువురు మండిపడుతున్నారు. మరి కొందరు అమీర్ ఖాన్ పనిని మెచ్చుకుంటున్నారు. అయితే.. ఈ వివాదం మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా ద్రుష్టికి వెళ్లింది. మరోసారి హిందువుల మనోభావాలను దెబ్బతీసే యాడ్ లో నటించవద్దని అమీర్ ఖాన్ కు తెగేసి చెప్పారు.