ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావు సీబీఐ కస్టడీని మరో 2 రోజుల పాటు పొడిగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో అభిషేక్ కస్టడీ ముగియడంతో ఆయనను సీబీఐ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ మూడు రోజుల పాటు అభిషేక్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని, తాము కూడా ఇంకా కొన్ని పత్రాలు, ఆధారాలు పరిశీలించాల్సి వుందని సీబీఐ అధికారులు జడ్జి ముందు తమ వాదనలు వినిపించారు.

 

దీంతో సీబీఐ అధికారుల అభ్యర్థనను కోర్టు మన్నించింది. దీంతో కోర్టు మరో 2 రోజుల పాటు కస్టడీని పొడిగించింది. ఇక… అరుణ్ పిళ్లైతో అభిషేక్ కు సంబంధాలున్నాయని, వారి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. విచారణకు హాజరుకావాలని అరుణ్ పిళ్లైకు నోటీసులు ఇచ్చామని, అయితే ఆయన కూతురు హాస్పిటల్ లో అడ్మిట్ అయినందున విచారణకు హాజరుకాలేదని చెప్పారు.