మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తనయుడి గురించి చెబుతూ ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెరంగేట్రం చేసి.. టాలీవుడ్ ‘చిరుత’ వేగంతో దూసుకువచ్చి.. మగధీరుడిలా రికార్డులు తిరగరాస్తూ.. బాక్సాఫీసు వద్ద ‘రచ్చ’ చేస్తూ.. ‘రంగస్థలం’పై నటన విశ్వరూపాన్ని ప్రదర్శించి.. RRR సినిమాతో ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించాడు. తండ్రి తగ్గ తనయుడిగా రాణిస్తూ.. పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ సందర్భంగా చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ గురించి గొప్పగా చెబుతూ ట్వీట్ చేశారు. ”ఒక నటుడిగా రామ్ చరణ్ ‘చిరుత’ నుంచి ‘మగధీర’.. ‘రంగస్థలం’ ‘RRR’, తాజాగా డైరెక్టర్ శంకర్‌తో RC 15 వరకు తనని తాను మార్చుకుంటూ ఎదిగిన తీరు ఎంతో బాగుంది. తన వర్క్, డెడికేషన్ అన్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది. చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలి. నా కొడుకు గురించి నేను గర్విస్తున్నాను. నీ కోసం ఎదురుచూసే మరేన్నో గొప్ప ఘనతలు ఉన్నాయి. వాటి వైపు వెళ్ళు. నువ్వు కచ్చితంగా సాధిస్తావ్..” అంటూ ఆయన రాసుకొచ్చారు. రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ RC 15 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అధికారి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్‌జే సూర్య , శ్రీకాంత్ , సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో RC 15ను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
On reaching the 15 years milestone, fondly reflecting on @AlwaysRamCharan ‘s journey in films.
It is heartening how he has evolved as an Actor from #Chirutha to #Magadheera to #Rangasthalam to #RRR ..and now to #RC15 with Director Shankar pic.twitter.com/WKljqRzbyi
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022