సూపర్ డైలాగ్స్‌తో అదరగొట్టిన మెగా స్టార్ ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్  మూవీ ట్రైలర్ వచ్చేసింది.  మెగా అభిమాల నిరీక్షణకు తెరపడింది. ఎంతగానో ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్  మూవీ ట్రైలర్ వచ్చేసింది. అంచనాలకు తగినట్లే ట్రైలర్‌లో మెగాస్టార్ చిరంజీవి  సూపర్ డైలాగ్స్‌తో అదరగొట్టేశారు. అక్టోబర్ 5న ఆడియన్స్ ముందుకు రానుండగా.. నేడు (సెప్టెంబర్ 28) అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ ను గ్రాండ్‌ జరుగుతోంది. ఈ వేదికపైనే గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ను లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ‘మంచోళ్లందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక. అన్ని రంగులు మారుతాయి..’ అనే డైలాగ్‌తో మొదలుపెట్టేశారు. ‘అన్నయ్య వచ్చేసినాడు.. అన్నీ వొగ్గేసి వెళ్లిపోండి’ అంటూ చిరంజీవి ఎంట్రీని చూపించారు. చిరంజీవి నడుచుకుంటూ వస్తున్న టైమ్‌లో థమన్ బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు. మెగాస్టార్ ఎంట్రీ టైమ్‌లో అభిమానులకు గూస్ బంప్స్ పక్కా అని చెప్పొచ్చు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను. కానీ రాజ‌కీయం నా నుంచి దూరం కాలేదు’ అనే డైలాగ్ ట్రైలర్‌లో మరో లెవల్లో ఉంది. ‘నేను ఉన్నంత వరకు ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’ అంటూ చిరంజీవి పవర్ ఫుల్‌గా చెప్పారు.

చిరంజీవి ఇందులో ‘బ్రహ్మా’ క్యారెక్టర్ పోషిస్తున్నారు. నయనతార చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా.. ఆమె రోల్ కూడా పవర్‌ఫుల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. విలన్ రోల్‌లో సత్యదేవ్ సరిగ్గా సెట్ అయ్యాడు. ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్  ‘హాలో బ్రదర్’ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ‘నాయితెర మ్యాటర్ హై.. నామేరా మ్యాటర్ హై.. ఏ ఫ్యామిలీ మ్యాటర్ హే..’, ‘తేరే బడే భాయ్‌కే బడే భాయ్‌కా గాడ్ ఫాదర్’ అంటూ ఎక్స్‌ట్రార్డినరీ డైలాగ్స్ చెప్పాడు. చిరంజీవితో కలిసి భారీ ఫైట్ కూడా చేశాడు. సల్మాన్ ఖాన్ ముందు చంపుకుంటూ వస్తుండగా.. వెనుక నుంచి చిరంజీవి వచ్చే సీన్ హైలెట్‌గా ఉంది.

https://twitter.com/KonidelaPro/status/1575130987360530438

Related Posts

Latest News Updates