‘కౌశిక వర్మ దమయంతి’ చిత్రం లోని “పదరా పదరా వేటకు వెళ్దాం” సాంగ్ ను రిలీజ్ నిర్మాత సి.కళ్యాణ్

దమయంతి అనే రైటర్ కౌసిక్ వర్మను వశం చేసుకోవడానికి ఆమె చేసిన విశ్వ ప్రయత్నం విఫలం అవ్వడంతో తను ఇచ్చిన శాపం  ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తున్న కథ.  “కౌశిక వర్మ దమయంతి”. వియాన్ జీ అంగారిక సమర్పణలో గురు దాత క్రియేటివ్ వర్క్స్  పతాకంపై  విశ్వజిత్, అర్చన సింగ్, ఊర్వశి రాయ్, రఘు దీప్ నటీ నటులుగా సుధీర్, విశ్వజిత్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  విడుదలకు సిద్దమైన  సందర్బంగా ఈ చిత్రంలో  హేమచంద్ర పాడిన  “పదరా పదరా వేటకు వెళ్దాం” పాటను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ చేతులమీదుగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్  మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “కౌశిక వర్మ దమయంతి సినిమాకు యస్. యస్ ఆత్రేయ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. హేమచంద్ర పాడిన  “పదరా పదరా వేటకు వెళ్దాం” పాట చాలా బాగుంది. ఈ సినిమాకు విశ్వజిత్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా  చాలా కష్టపడి తీశారు.ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్న దర్శక, నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. చిత్ర హీరో , నిర్మాత విశ్వజిత్ మాట్లాడుతూ..కౌశిక వర్మ దమయంతి” చిత్రం లో  హేమచంద్ర పాడిన “పదరా పదరా వేటకు వెళ్దాం” పాటను అడిగిన వెంటనే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ విడుదల చేసిన నిర్మాత సి.కళ్యాణ్ గారికి ధన్యవాదములు.సినిమా బాగా వచ్చింది.200 ఇయర్స్ బ్యాక్ స్టోరీ, ప్రెజెంట్ స్టోరీ లతో తెరకెక్కిన ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ రెండు స్టోరీలను బ్యాలెన్స్ చేస్తూ, నటీ నటులు టెక్నిషియన్స్ సపోర్ట్ తో ఎంతో  కష్టపడి  తీయడం  జరిగింది. 200 ఇయర్స్ బ్యాక్ స్టోరీని, ప్రెజెంట్ స్టోరీని తెరాకెక్కించడం అనేది చాలా కష్టం. కానీ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇందులో ఉన్న నాలుగు పాటలు చాలా బాగుంటాయి. 200 ఇయర్స్ బ్యాక్ లో సాగే పాతకాలపు సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. సెన్సార్ వారు ఈ సినిమాను చూసి చాలా బాగుందని మెచ్చుకొని U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాను నవంబర్ లో విడుదల చేయడానికి  సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. చిత్ర దర్శకుడు సుధీర్ మాట్లాడుతూ.. .ఇలాంటి మంచి హిస్టరికల్ సినిమాకు  దర్శకత్వం చేసే  అవకాశం ఇచ్చిన హీరో, నిర్మాత విశ్వజిత్  గారికి  ధన్యవాదములు.అందరూ  సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.గోవాలో  షూట్  చేసుకున్న “పదరా పదరా వేటకు వెళ్దాం” సాంగ్ ను   సి.కళ్యాణ్ గారు విడుదల చేశారు చాలా సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మా  సినిమాకు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు నటుడు రఘు దీప్, మాట్లాడుతూ.. ఇలాంటి మంచి హిస్టరికల్ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు కొరియోగ్రాఫర్ జిన్నా మాట్లాడుతూ..ఇలాంటి మంచి సినిమాకు కొరియోగ్రఫీ చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కో డైరెక్టర్ లక్ష్మణ్ ఉదురుకోట,  నటుడు ఆగస్తిన్, మేనేజర్ సాయికిశోర్ సోనే తదితరులు హిస్టరికల్ వంటి మంచి సబ్జెక్టు తో  వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు. నటీ నటులు హీరో విశ్వజిత్, అర్చన సింగ్, ఊర్వశి రాయ్, రఘు దీప్, ఆగస్తిన్ తదితరులు సాంకేతిక నిపుణులు సమర్పణ : వియాన్ జీ అంగారిక బ్యానర్ : గురు దాత క్రియేటివ్ వర్క్స్ నిర్మాత : గీతా కౌషిక్ దర్శకత్వం : సుధీర్, దర్శకత్వ  పర్యవేక్షణ : విశ్వజిత్ సంగీతం : యస్ యస్ ఆత్రేయ, ఎలెందర్  మహావీర్  డి. ఓ. పి.: శివకుమార్ ఎడిటర్ : వంశీ రెడ్డి, ఆనంద్ పవన్ కొరియోగ్రాఫర్ : జిన్నా, సాగర్, విశ్వజిత్ లిరిసిస్ట్ ::నందకుమార్, కొకల కృష్ణ, దీప్తి, ప్రవీణ్ మాచవారం సింగర్స్ : గీత మాధురి, సంపత్, హేమచంద్ర, వైశాలి  మాడే, విశ్వజిత్, దీప్తి పి. ఆర్. ఓ : టి. యస్. యన్.మూర్తి

Related Posts

Latest News Updates