అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

భారత సంతతికి చెందిన మోనిక నార్ల అమెరికాలోని అరిజోన సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె బోర్డు ఆఫ్ సూపర్వైజర్ ఆడిటోరియంలో ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరులో పుట్టిన మోనిక మూడేళ్ల వయస్సు వచ్చే వరకు ఆమె పెద్దమ్మ, గుంటూరు నగర మాజీ మేయర్ డాక్టర్ కొల్లి శారద నివాసంలోనే పెరిగారు. ఆమె తల్లిదండ్రులు వృత్తిరీత్యా అమెరికాలో డాక్టర్లు కావడంతో ఆ తర్వాత అక్కడికి వెళ్లి స్థిరపడిపోయారు. తన తాత నార్ల వెంకటేశ్వరరావు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. దాంతో ఆమె తన పేరుని మోనిక నార్ల బెల్లప్రవాలు ఎడెల్స్టెయిన్గా పెట్టుకొన్నారు. ఇందులో బెల్లప్రవాలు తన తల్లి ఇంటి పేరు కాగా ఎడెల్స్టెయిన్ తన భర్త ఇంటి పేరు.

యూనివర్శిటీ ఆఫ్ అరిజోన జేమ్స్ ఈ రాడ్జర్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి 2004లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అరిజోన జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ కంపేరిటివ్ లా సంస్థలో ఎడిటర్-ఇన్-చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2006లో న్యూయార్క్ యూనివర్శిటీ నుంచి ట్యాక్సేషన్లో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. అలానే బోస్టన్ కళాశాలలో సోషియాలజీ/కమ్యూనికేషన్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వాషింగ్టన్ డీసీలోని వెస్ట్రన్ క్రిమినల్ ఎన్ఫోర్స్మెంట్ సెక్షన్లో డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ ట్యాక్స్ డివిజన్లో ఫెడరల్ ప్రాసిక్యూటర్గా మోనిక తన కెరీర్ని ప్రారంభించారు. ఫెడరల్ కోర్టులో ఆర్థిక నేరాల కేసులను ఆమె వాదించేవారు. అసిస్టెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అటార్నీగా కూడా విధులు నిర్వహించారు. యూఎస్ ఎయిర్ఫోర్సులో ఆమె క్రియాశీలక సభ్యురాలుగా ఉన్నారు. 2017 జనవరిలో నేరుగా రిజర్వ్ కార్ప్లో కమిషనింగ్ అయ్యారు. ఆమె అరిజోన లూక్ ఎయిర్ ఫోర్స్ బేస్లో రిజర్వ్ స్టాఫ్ జడ్జ్ అడ్వొకేట్గా సేవలందించారు.  ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లిన వారిలో చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు అయ్యారే తప్ప.. న్యాయమూర్తిగా ఎంపిక కావడం బహు అరుదు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం