తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో టొరంటో నగరంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమం తొలుత అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వర్ ఈద, గవర్నింగ్ బోర్డు ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీప గజవాడ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఈ కార్యక్రమములో అతిపెద్ద (దాదాపు 6 అడుగుల) బతుకమ్మను తయారు చేసింది. దీని చుట్టు మహిళలు బతుకమ్మ ఆడిన తీరు వీక్షకులను ఆకట్టుకుంది. బతుకమ్మ ఆట సుమారు 6 గంటల వరకు ఏకధాటిగా కొనసగగా.. మగువలు, చిన్నారులు సందడి చేశారు. చివరకు పోయిరావమ్మ బతుకమ్మ, పోయిరావమ్మ గౌరవమ్మ అనే పాటతో ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం పూర్తి చేశారు. అనంతరం సత్తుపిండి, నువ్వుల పిండి, పల్లీల పండిని ఫలహారాలుగా పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో పలు వంటకాలతో  డిన్నర్ను ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ సంతోష్ గజవాడ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం, జనరల్ సెక్రెటరీ దామోదర్ రెడ్డి మాది, ట్రెజ్రెరర్ నవీన్ ఆకుల మరియు కల్చరల్  దీప గజవాడ, మరియు కార్యవర్గ సభ్యులు, గిరిధర్ క్రోవిడి, ఉదయ భాస్కర్ గుగ్గిళ్ల, రాహుల్ బాలినేని, ధాత్రి అంబటి, బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి దేప, రాజేష్ ఆర్రా, ప్రకాష్ చిట్యాల, మనోజ్ రెడ్డి, సంస్థ ఫౌండేషన్ కమిటీ సభ్యులు కోటేశ్వర రావు చిత్తలూరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస్ తిరునగరి,శ్రీనాథ్ కుందూరి తదితరులు పాల్గొన్నారు. 1200 మందికిపైగా కెనడాలోని తెలంగాణ వాసులు సంబరాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం