క్రేజీవాల్ కీలక వ్యాఖ్యలు.. గుజరాత్ లో ఆప్ విజయం

ఈ ఏడాది చివరిలో జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢల్లీి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఫుల్‌ ఫోస్‌ పెట్టారు. రాజ్‌కోట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గుజరాత్‌లో ఆప్‌ విజయం సాధిస్తుంది. సూరత్‌లో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌ 7 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు.  మీరు భయపెడితే భయపడటానికి కాంగ్రెస్‌ నాయకులం కాదు.. మేం సర్దార్‌ వల్లభాయ్‌ పటేళ్లం. భగత్‌ సింగ్‌లం..భయపడం పోరాడుతామని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతామని తెలిస్తే చాలు బీజేపీ కుట్ర రాజకీయాలకు ప్పాలడుతోందని ఆరోపణలు చేశారు. ఆప్‌ నాయకుడు మనోజ్‌పై దాడి చేయడాన్ని సూరత్‌ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. బీజేపీ గుండాలు దాడి చేయడంతో గుజరాత్‌లోని ఆరు కోట్ల మంది ప్రజలు ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఓ నాయకుడిపై దాడి చేయడం మన దేశ సంస్కృతి కాదు. అసలు గుజరాత్‌ సంస్కృతి కాదంటూ వ్యాఖ్యలుచేశారు.

Related Posts

Latest News Updates