నూతన సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ను నియమించాలంటూ సీజేఐ యూయూ లలిత్ చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. కొత్త సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ఈ నెల 11 న సీజేఐ లలిత్ కేంద్రానికి సిఫార్సు చేశారు. కేంద్ర న్యాయశాఖ ఈ ప్రతిని రాష్ట్రపతి వద్దకు పంపింది. రాష్ట్రపతి దీనిని ఆమోదించారు. ప్రస్తుతం సీజేఐగా వున్న యూయూ లలిత్ నవంబర్ 8 న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నూతన సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 9 న ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు ట్వీట్ చేశారు. రెండేళ్ల పాటు అంటే 2024 నవంబర్ 10 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్ 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.