ఆస్ట్రేలియాలోని భారత విద్యార్థి శుభం గార్గ్ (28) పై కత్తి దాడి జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిడ్నీలోని న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో గార్గ్ పీహెచ్ డీ చేస్తున్నాడు. అక్టోబర్ 6 న రాత్రి ఏటీఎంలో డబ్బులు తీసుకురావడానికి వెళ్లాడు. డబ్బులు ఇవ్వాలంటూ దుండగుడు గార్గ్ ను డిమాండ చేశాడు. అందుకు గార్గ్ తిరస్కరించాడు. దీంతో ముఖం, ఛాతి, పొట్ట లో మొత్తం 11 కత్తి పోట్లు పొడిచాడు దుండగుడు. దీంతో బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే… విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా వుందని వైద్యులు తెలిపారు. ఇక… గార్గ్ స్వస్థలం యూపీలోని ఆగ్రా. మరోవైపు తమకు సాయం చేయాలని గార్గ్ సోదరి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ను కోరారు. దీంతో ఆస్ట్రేలియాలోని హైకమిషన్ స్పందించింది. అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది.
