హైదరాబాద్ లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ తో పాటు షాపింగ్ మాల్ డైరెక్టర్ల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఐటీ అధికారులు పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో వున్న అన్ని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూముల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రిందటే ఆర్ఎస్ బ్రదర్స్ యజమానులు రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో వీరు పనులు చేస్తున్నారు.