ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో శ్రీవిష్ణు హీరో, హీరోయిన్ గా రెబా మోనికా జాన్

వెర్సటైల్ హీరో శ్రీ విష్ణు కొత్త సినిమా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభమైంది.  రామ్ అబ్బరాజు ‘వివాహ భోజనంబు’ (ఓటీటీ రిలీజ్) తో ఆకట్టుకున్నారు. శ్రీ విష్ణు తో చేస్తున్న ఈ కొత్త చిత్రంతో రామ్ అబ్బరాజు థియేటర్ సినిమాకి పరిచయం అవుతున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ పతాకంపై రజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన కథానాయికగా నటించడానికి యంగ్ ట్యాలెంటడ్ నటి రెబా మోనికా జాన్‌ను నిర్మాతలు ఎంపిక చేశారు. రెబా మోనికా గతంలో మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో ఆకట్టుకున్నారు. హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 3గా పూర్తి ఫన్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి భాను బోగవరపు కథని అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్‌ అందిస్తున్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. అత్యున్నత సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. తారాగణం: శ్రీ విష్ణు,  రెబా మోనికా జాన్ , సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు. సాంకేతిక విభాగం : సమర్పణ : అనిల్ సుంకర   స్క్రీన్ ప్లే, దర్శకత్వం – రామ్ అబ్బ రాజు నిర్మాత – రాజేష్ దండా సహ నిర్మాత – బాలాజీ గుత్తా బ్యానర్లు- ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ కథ – భాను బోగవరపు డైలాగ్స్ – నందు సవిరిగాన సంగీతం – గోపీ సుందర్ సినిమాటోగ్రాఫర్ – రాంరెడ్డి

Related Posts

Latest News Updates