ఆరోగ్యశ్రీ లోకి మరిన్ని చికిత్సలు.. ప్రకటించిన సీఎం జగన్

ఆరోగ్య శ్రీ పథకంలోని చికిత్స సంఖ్యను 2,446 నుంచి 3,254కు త్వరలోనే పెంచుతామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. గత సర్కారుతో పోలిస్తే మూడు రెట్లు అదనంగా ఇందుకోసం ఖర్చు చేస్తున్నామని, ప్రజారోగ్యం పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుందన్నారు. సీఎం జగన్ అధికారులతో కలిసి వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య శాఖలో నియామకాలు, ఆరోగ్యశ్రీలో చికిత్సల పెంపు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణం సహా పలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీలోకి కొత్తగా చేర్చిన చికిత్సలను అక్టోబర్ 15 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అదే రోజు ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామని సీఎం జగన్ తెలిపారు.

 

 

ఆరోగ్యశ్రీ పథకం కోసం ఏటా 2,500 కోట్లు, 108,104 అంబులెన్స్ ల కోసం మరో 400 కోట్లు ఖర్చు పెడుతున్నామని సీఎం జగన్ వివరించారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు 10 వేల వైఎస్సార్ విలేజ్ క్లీనిక్ లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిలో 12 రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు 67 రకాల మందులు కూడా వుంటాయని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం