చండీగఢ్ యూనివర్శిటీ వీడియో లీక్ పై సిట్ ఏర్పాటు

ఇబ్బందికర వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయంటూ చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పంజాబ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు మహిళా సభ్యులతో ఓ సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ అత్యున్నత అధికారులు ప్రకటించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి గురుప్రీత్ కౌర్ దేవ్ పర్యవేక్షణలో ఈ సిట్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సిట్ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, ఈ వీడియోలు లీక్ లో ప్రమేయం వున్న వారిని విడిచిపెట్టదని స్పష్టం చేస్తున్నారు. అయితే.. దీనిపై దర్యాప్తు ప్రక్రియ వేగంగా సాగుతోందని, పుకార్లను మాత్రం నమ్మవద్దని డీజీపీ కోరారు.

 

మరో వైపు విద్యార్థుల ఆందోళనలు తీవ్రం కావడంతో యూనివర్శిటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు సెలవులను ప్రకటించారు. దీంతో కొంతమంది విద్యార్థులు ఇప్పటికే వర్సిటీ క్యాంపస్ ను వదిలి ఇళ్లకు వెళ్లిపోయారు. మరోవైపు వీడియోలు తీసిన ఘటనతో సంబంధమున్నట్లుగా భావిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, మరొకరినిఅదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్.. నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

Related Posts

Latest News Updates