అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సీనియర్ నేత శశి థరూర్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సోమవారం టెన్ జన్‌పధ్‌లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. పార్టీ నేతలు దీపేందర్ హుడా, జై ప్రకాష్ అగర్వాల్, విజయేంద్ర సింగ్‌లతో కలిసి శశి థరూర్ సోనియాతో సమావేశమయ్యారు. శశి థరూర్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో వుంటారని కొన్ని రోజులుగా వార్తలు బాగా ప్రచారంలో వున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.