ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గుండె సంబంధిత అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు చికిత్సలు చేసిన వైద్యులు ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అయితే ముందుగా ఆయన విజయవాడలోని స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని.. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.