కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. మొదటి ఓటు పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం వినియోగించుకున్నారు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, సీనియర్ నేత సుబ్బిరామి రెడ్డి తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక.. నేడు చారిత్రాత్మకమైన రోజు అని జైరాం అభివర్ణించారు. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని ఆయన ప్రకటించారు.
ఇక… అధ్యక్ష రేసులో వున్న శశి థరూర్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ భవిష్య త్తు అంతా కార్యకర్తల చేతిలోనే వుందన్నారు. కొంత మంది ఓడిపోకుండా వుండేందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారని, కానీ.. వారు కచ్చితంగా ఓడిపోతారని థరూర్ పేర్కొన్నారు.
Congress presidential elections | Congress MPs P Chidambaram, Jairam Ramesh and other party leaders cast their votes at the AICC office in Delhi. pic.twitter.com/IUMhCjKdst
— ANI (@ANI) October 17, 2022