శశి థరూర్, వాస్నిక్, దిగ్విజయ్.. రేసులో వుంది వీరే

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ… ఉత్కంఠత పెరిగిపోతోంది. ఎవరు అధ్యక్ష ఎన్నికల పోటీలో వుంటారు? ఎవరు వుండరు? అన్న దానిపై టెన్షన్ మరింత పెరిగిపోతోంది. అయితే.. ముందు నుంచి కూడా శశి థరూర్ అధ్యక్ష పోటీలో ముందు వరుసలోనే వున్నారు. ఈయన కంటే రాజస్థాన్ సీఎం గెహ్లాట్ అందరి కంటే ముందు వరుసలో నిలిచారు. అయితే.. రాజస్థాన్ లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆయన పేరు వెనక్కి పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష రేసులో కొంత మంది వున్నారు. శశి థరూర్, ముకుల్ వాస్నిక్, ఖర్గే, దిగ్విజయ సింగ్, కేసీ వేణు గోపాల్ పేర్లు ముందు వరసులో వున్నాయి. వీరందరూ ప్రత్యక్ష ఎన్నికలు కాస్త దూరంలోనే వున్నారు.

 

 

అయితే… వీరందరూ గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తులుగా కూడా వున్న విషయాన్ని మరిచిపోవద్దు. మధ్యలో దిగ్విజయ్ సింగ్ పేరు ముందుకు వచ్చింది. ఆ తర్వాత తాను రేసులో లేనని ప్రకటించారు. కానీ.. రాజస్థాన్ ఎపిసోడ్ ముందుకి వచ్చిన తర్వాత.. తాను కూడా రేసులో వున్నానని పేర్కొన్నారు. అయితే.. నామినేషన్ల ప్రక్రియ తేదీ మాత్రం ప్రారంభమైంది. ఈ నెల 30 వరకూ ఈ నామినేషన్ల ప్రక్రియ వుంటుంది. ఇప్పటి వరకూ థరూర్, పవన్ బన్సల్ నామినేషన్ ఫామ్ లను తీసుకున్నారని ఎన్నికల అధికారి మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. అయితే.. 30 న థరూర్ నామినేషన్ దాఖలు చేయడం ఖాయమైంది. అయితే.. తన కోసం ఫామ్ తీసుకోలేదని, ఇతరుల కోసం తీసుకున్నానని బన్సల్ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates