దమ్ము ధైర్యముంటే జిన్నా అనే వ్య‌క్తి నీచుడ‌ని చెప్పే సినిమా తీయండి! : రచయిత కోన వెంకట్

విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘జిన్నా’ . ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న రిలీజ్ అవుతుంది. మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన రోజున టైటిల్‌పై వివాదం న‌డిచిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాదం గురించి రైట‌ర్ కోన వెంక‌ట్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో స్పందించారు. జిన్నా టైటిల్ వివాదంతో పాటు శ్రీను వైట్ల‌తో ఉన్న మ‌న‌స్ప‌ర్ద‌ల గురించి కూడా ఆయ‌న మాట్లాడారు. విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘జిన్నా’ . ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న రిలీజ్ అవుతుంది. మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన రోజున టైటిల్‌పై వివాదం న‌డిచిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాదం గురించి రైట‌ర్ కోన వెంక‌ట్ ) రీసెంట్ ఇంట‌ర్వ్యూలో స్పందించారు. జిన్నా టైటిల్ వివాదంతో పాటు శ్రీను వైట్ల‌తో ఉన్న మ‌న‌స్ప‌ర్ద‌ల గురించి కూడా ఆయ‌న మాట్లాడారు. ‘‘జిన్నా’ టైటిల్ వివాదంలో అర్థం పర్థం లేదు. బీజేపీ లీడ‌ర్ విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డిగారు జిన్నా అనే వ్య‌క్తి నీచుడు, నికృష్ణుడు, మ‌న దేశ విభ‌జ‌న‌కు కార‌ణ‌మైనోడు అని లైవ్‌లో మాట్లాడుతున్న‌ప్పుడు నేను విన్నాను. జిన్నా అనే వ్య‌క్తి నీచుడ‌ని చెప్పే సినిమా తీయండి. మేం స‌పోర్ట్ చేస్తాం. అలాంటి ఓ క‌థ రాయండని అన్నారు. దానికి నేను మాట్లాడుతూ ‘సార్ అద్భుతమైన ఐడియా. నా నెక్ట్స్ స్క్రిప్ట్ ఇదే. మీరే ప్రొడ్యూసర్ అన్నాను. మీరు సినిమాను నిర్మిస్తే నేను కథ రాస్తాను’ అని అన్నాను. జిన్నా అంటే జి.నాగేశ్వరరావు అని క్లియర్‌గా చెప్పాం. దానిపై వివాదం చేయాల్సిన అవసరం ఏముంది. అదే జిన్నా అనేది తిరుపతిలో పెరిగిన ఓ ముస్లిం క్యారెక్టర్ అయ్యుంటే అప్పుడు ఆ వివాదంలో అర్థముండేది. అంతకు ముందు విష్ణు హిట్ చిత్రాలు ఢీ, దేనికైనా రెఢీ చిత్రాలకు నేనే రైటర్. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ మా కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం మోహన్ బాబుగారింట్లోకి అడుగు పెట్టాను. నా వర్క్‌తో ఆయన్ని కలవటానికి కుదరలేదు. నన్ను నమ్మి ఈ సినిమా చేయమని చెప్పాను’’ అన్నారు.  శ్రీను వైట్ల తో ఉన్న మనస్పర్ధల గురించి కూడా ‘‘‘దూకుడు’ స‌మ‌యంలోనే శ్రీనువైట్ల ‘ఆగడు’ ఉంటుంద‌ని చెప్పారు. అయితే దూకుడు సినిమా చివ‌ర‌లో వ‌చ్చేస‌రికి మ‌నోడి (శ్రీనువైట్ల‌)లోని మ‌రొక‌డు బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అంతా నేనే అనుకున్నాడు. అంతా నువ్వే అయిన‌ప్పుడు వాళ్ల‌తో ప‌నేంటి (మ‌మ్మ‌ల్ని ఉద్దేశించి)’ అని అంటారు క‌దా, అది నిర్మాత అనొచ్చు, హీరో అనొచ్చు. అలాగే అన్నారు. మన పక్కనున్నవాడు నిజంగా చేయకపోయినా మనం వాడికి క్రెడిట్ ఇస్తే వాడు క‌న్నీళ్లు పెట్టుకుని జీవితాంతం మ‌న‌కు బానిస‌లా ప‌ని చేస్తాడు. కానీ చేసిన‌ప్పుడు కూడా పేరు వేయ‌క‌పోతే ఎలా!. అంతా నేనే అనుకున్న‌ప్పుడు ఎందుక‌ని నేను, గోపి మోహ‌న్ సైలెంట్‌గా పక్కకి తప్పుకున్నాం’’ అన్నారు కోన వెంకట్.

Related Posts

Latest News Updates