కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంపై ఆ ఎంపీ రాహుల్ గాంధీ మళ్లీ డొంకతిరుగుడు సమాధానమే ఇచ్చారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన ఆయన మూడో రోజు తమిళనాడులోని నాగర్ కోయిల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సమయంలోనే అధ్యక్ష బాధ్యతలు చేపడతారా? అని ప్రశ్నించగా… పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగే సమయంలోనే తాను అధ్యక్షుడిగా వుంటానా? వుండనా? అన్నది స్పష్టమవుతుందని అన్నారు.
అయితే.. తానేం చేయాలో స్పష్టంగా నిర్ణయించుకున్నానని, అందులో గందరగోళం మాత్రం లేదని రాహుల్ స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు, సమస్యలను తెలుసుకోడాపనికి పాదయాత్ర చేస్తున్నట్లు రాహుల్ ప్రకటించారు. అయితే తాను ఈ పాదయాత్రకు నాయకత్వం వహించడం లేదని, కేవలం ఓ కార్యకర్తగానే పాల్గొంటున్నానని అన్నారు. బీజేపీ సిద్ధాంతాల వల్ల దేశానికి నష్టం జరిగిందని, అన్ని సంస్థలనూ తన అదుపులోకి తీసుకొని, ప్రతిపక్షాలపై ప్రయోగిస్తోందని రాహుల్ మండిపడ్డారు.