ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు భవనాల అధికారులకు టార్గెట్ విధించారు. మార్చి 31 నాటికి అన్ని రోడ్లనూ మళ్లీ బాగు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయని, రోడ్ల పరిస్థితి ఏమిటో ఓసారి పరిశీలించాలని ఆదేశించారు. సీఎం జగన్ నేడు పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖలతో సమావేశం నిర్వహించారు. చెత్త చెదారం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఎప్పటి కప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో కూడా వేస్ట్ ప్రాసెసింగ్ ప్రక్రియల అమలు తీరును పరిశీలించాలన్నారు.
ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రక్రియ పూర్తి స్థాయిలో వుందా? లేదా? అని పరిశీలించాని సూచించారు. కృష్ణా నది వరద ముంపు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మించామని, గోడకు మురుగు నీరు రాకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.అలాగే జగనన్న కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జగనన్న స్మార్గ్ టౌన్ షిప్ కార్యక్రమంపై శ్రద్ధ పెట్టాలని, ప్రతి నియోజకవర్గానికి ఓ లేఅవుట్ ను తీర్చిదిద్దాలని సూచించారు.