రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, బళ్లారి రాఘవ స్మారక సంఘం సంయుక్తంగా ఈ నెల 8,9 తేదీల్లో బళ్లారి రాఘవ మందిరంలో రాష్ట్రేతర సమాఖ్య జాతీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు భాషను బతికించుకోవాలన్న ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 150 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు కోటేశ్వర రావు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, కేరళ నుంచి కూడా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు తీర్మానాలు చేస్తామని వెల్లడించారు. ఇక… వివిధ అంశాలపై చర్చించడంతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, సాహిత్య సదస్సులు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు అధ్యక్షులుగా, రాష్ట్ర రవాణా మంత్రి బి. శ్రీరాములు, విశిష్ట అతిథులుగా శాసన సభ్యుడు గాలి సోమశేఖర రెడ్డి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర తో పాటు ఇతరులు కూడా పాల్గొంటారని తెలిపారు.