మూడు రాజధానులతో మంచి జరుగుతుందని చెబితే.. కొందరు చెప్పులు చూపిస్తున్నారు : పవన్ కు సీఎం జగన్ కౌంటర్

పేదవాడి బాగోగులు పట్టించుకునే ప్రభుత్వం తమదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వెన్నుపోటుదారులంతా ఎవరికీ మంచి చేయలేదని, ఎన్నికల తర్వాత వారు వాగ్దానాలు కూడా మరిచిపోతారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో రైతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. మూడు రాజధానుల వల్ల మంచి జరుగుతోందని చెబుతూనే వున్నామని, కానీ.. కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు తిడుతున్నారని పరోక్షంగా జనసేన చీఫ్ పవన్ పై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారని మండిపడ్డారు. మూడు రాజధానుల వల్ల మేలు జరుగుతుందని అంటుంటే…. దత్త పుత్రుడు మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని అంటున్నారని ఫైర్ అయ్యారు.

 

భూములకు పక్కా రికార్డులు లేకపోవడం వల్లే సమస్యలు

75 సంవత్సరాలుగా భూములకు సంబంధించిన పక్కా రికార్డులు లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని సీఎం జగన్ అన్నారు. వాటిని తొలగించి, ప్రజలకు మేలు చేసేందుకే తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందన్నారు. భూ యాజమాన్య విషయంలో, సరిహద్దుల విషయంలో స్పష్టత లేని కారణంగా కార్యాలయాల చుట్టూ గత ప్రభుత్వ హయాంలో తిరిగేవారని విమర్శించారు. అందుకే భూముల రీసర్వేను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నామని వివరించారు. శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడుతున్నట్లు సీఎం జగన్ వివరించారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్