వాతావరణ మార్పుల సమస్య ప్రపంచం అంతటా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ కెవడియాలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియా గుటేరస్‌తో కలిసి మిషన్ లైఫ్ ప్రోగ్రాంను మోదీ ఈ రోజు ప్రారంభించారు. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మిషన్ లైఫ్ సహాయం చేస్తుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఇంటిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఇంటిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పలు దేశాలు చట్టాలు చేస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం వెనుకబడి ఉంటున్నాయన్నారు.
తద్వారా కర్భన ఉద్ఘారాలు పెరిగి దృవ ప్రాంతాల్లో మంచు కరిపోతుందన్నారు. దీంతో సముద్ర మట్టాలు పెరగటం, అకాల వర్షాలు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తులు చోటుచేసుకుంటున్నాయన్నారు. అందువల్ల ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. భారత్ లో కాలుష్య నివారణతో పాటు… పర్యావరణ సంరక్షణకు గ్రామస్థాయి నుంచి అవగాహనా కార్యక్రమాలు చేపట్టినట్లు మోదీ వివరించారు. వాతావరణ మార్పు అనేది విధానపరమైన సమస్య అన్న అపోహ వుందన్నారు. అంతర్జాతీయ సంస్థలు దీనిపై చర్యలు తీసుకుంటాయన్న అభిప్రాయంలో వున్నారని, కానీ… నేడు యావత్ ప్రపంచం దాని ప్రభావాన్ని అనుభవిస్తోందని తెలిపారు. కొందరు ఏసీని 17 లో పెట్టుకుంటారని, ఇది వాతావరణంపై దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అలాగే జిమ్ కి వెళ్లే సమయంలో సైకిళ్లను వాడాలని, ఇలా చిన్న చిన్న విషయాలతో జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.