సీఎంకి కొరడా దెబ్బలు… కొరడా దెబ్బలు తిన్న చత్తీస్ గఢ్ సీఎం బాఘేల్

ఓ ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్నారు. నిజమే.. మీరు విన్నది. చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. రాష్ట్రంలోని కుమర్హరి గ్రామంలో జరిగే జానపద సంప్రదాయం ప్రకారం… అక్కడి వేడుకల్లో సీఎం బాఘేల్ పాల్గొన్నారు. దీపావళి రెండో రోజు అక్కడ గౌరి- గౌర పూజలు చేస్తారు. దీనిలో భాగంగా చెడును తరిమేందుకు కొరడా దెబ్బలు కొడతారు. ఈ సందర్భంగా మణికట్టుపై సీఎం బాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Related Posts

Latest News Updates