వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సర్వర్ డౌన్ అవడమే కారణమని, టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ వాట్సప్ ను త్వరగా రీస్టోర్ చేశారని వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 12. 30 గంటల నుంచి సేవలు నిలిచిపోయాయని యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. యూజర్లు మెసేజ్ లు పంపలేకపోతున్నట్లు తమ దృష్టికి రావడంతో సమస్యను పరిష్కరించినట్లు మెటా కంపెనీ ప్రతినిధి చెప్పారు. 95 నిమిషాల తర్వాత తిరిగి సేవలను పునరుద్ధరించినట్లు మెటా ప్రకటించింది.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు మెసేజ్ లు చేయలేకపోతున్నారు. మధ్యాహ్నం 12.07 గంటల నుంచి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. పర్సనల్ మెసేజ్ లకు సింగిల్ టిక్ మాత్రమే వస్తుండగా.. స్టేటస్ లు కూడా అప్ డేట్ కావడం లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక యూజర్లు అయోమయానికి గురవుతున్నారు.