హీరోయిన్స్‌

‘అల్లూరి’ గొప్ప స్ఫూర్తిని ఇచ్చే చిత్రం.. అందరికీ కనెక్ట్ అవుతుంది: శ్రీవిష్ణు

ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈచిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న నేపధ్యంలో శ్రీవిష్ణు విలేఖరుల సమావేశంలోచిత్ర విశేషాలని పంచుకున్నారు *అల్లూరి అంటేనే పవర్ ఫుల్. ఇటివల వచ్చిన అల్లూరి పాన్ ఇండియా విజయం సాధించింది. మీ అల్లూరి ఎలా వుండబోతుంది ? ఆయన రియల్ అల్లూరి. ఈ అల్లూరి ఆయన నుండి స్ఫూర్తి పొంది చేసిన కథ. కృష్ణ గారి సినిమా అల్లూరి సీతారామారాజు క్లైమాక్స్ లో ‘ఒక అల్లూరి చనిపోతే వందమంది అల్లూరిలు పుడతారని’ చెప్తారు. ఆ వందమందిలో మా అల్లూరి ఒకరు(నవ్వుతూ).  ఇదొక పోలీస్ స్టొరీ. అల్లూరి అనే ఫిక్షనల్ పాత్ర తీసుకొని కొన్ని యాధార్ధంగా జరిగిన సంఘటనలు ఆధారంగా తీర్చిదిద్దాం. ఒక పోలీస్ విధిలో చేరినప్పటి నుండి 15 ఏళ్ల సర్వీస్ లో ఏం చేశాడనేది ఒక అద్భుతమైన టైమ్ లైన్ ఇందులో చూపించబోతున్నాం. *యాధార్ధ సంఘటనలు అంటున్నారు కదా.. ఈ కథ చేయడానికి ఎంతకాలం రీసెర్చ్ చేశారు ?దర్శకుడు ప్రదీప్ వర్మ పూర్తి కథతో నా దగ్గరరికి వచ్చారు. ఈ కథలో సంఘటనలు నిజంగా జరిగినవేనని సినిమా చేస్తున్న క్రమంలో ఒకొక్కటిగా తెలిసింది.ఈ కథ విన్నపుడు పోలీస్, వ్యవస్థలో ఇంత డెప్త్ ఉందా అనిపించింది. ఎలాంటి పరిస్థితిలోనైనా నిజాయితీగా ఉంటూ విధిని నిర్వహించే ఓ పోలీస్ కథ ఇది. వ్యవస్థలో మంచి చెడులు ఇందులో చూపిస్తాం. చెడుకి పరిష్కారం కూడా చూపిస్తాం.*ఈ కథ చేసినపుడు పోలీసు అధికారులని ఎవరినైనా కలిశారా ఈ సినిమా చేసినప్పుడు కలవలేదు కానీ గత పదిహేను రోజులుగా చేసిన యాత్రలో  చాలా మంది పోలీసు అధికారులని కలిశాను. వారి సేవలకు కృతజ్ఞతలు చెప్పాను. *ప్రదీప్ వర్మ ఈ కథని ఎప్పుడు చెప్పారు ? ఐదేళ్ళ క్రితం చెప్పారు. నాకున్న సినిమాలన్నీ ఫినిష్ చేసి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాలనే సమయానికి కరోనా కారణంగా అందరం ఏడాదిన్నర ఆగిపోవాల్సివచ్చింది. తర్వాత సినిమా మొదలుపెట్టాం. *ఈ పాత్ర మీ నిజ జీవితంపై ఎలాంటి మార్పుని తీసుకొచ్చింది ? నేను చాలా సున్నితంగా మాట్లాడతాను. చాలా విషయాలకి రియాక్ట్ అవ్వను. ఐతే ఈ పాత్ర చేసిన  ర్వాత నా చుట్టూ జరిగే కొన్ని విషయాలపై కాస్త వాయిస్ పెంచి మాట్లడుతున్నా. *అల్లు అర్జున్ గారు ప్రీరిలీజ్ ఈవెంట్ మీ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు కదా ? బన్నీగారితో నాకు పదేళ్ళుగా మంచి స్నేహం వుంది. నా సినిమాల మంచి చెడులు చెప్తుంటారు. ఐతే ఎప్పుడూ ఆయన్ని ఏమీ అడగలేదు. ఆయన్నే కాదు సినిమా గురించి ఇండస్ట్రీ లో ఎప్పుడూ ఎవర్నీ ఏమీ అడగలేదు. ఐతే ఈ సినిమాకి కొత్త ఆడియన్స్ కావాలి. దీనికి నా ఒక్కడి బలం సరిపోదు. అందుకే బన్నీగారిని పిలిచా. ఆయన పిలవగానే వచ్చారు. అలాగే నాని, రవితేజ గారు కూడా మేము అడిగిన వెంటనే మాకు సపోర్ట్ చేశారు. *మీరు బేసిగ్గా మీ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడరు కదా.. కానీ అల్లూరి విషయంలో అదనపు శ్రద్ధ కనబరచడానికి కారణం ? అల్లూరి గురించి చాలా చాలా బలంగా చెప్తున్నారు కదా ? సినిమా నా మనసుకి నచ్చితే ఖచ్చితంగా బలంగా చెప్తాను. నీది నాదీ ఒకటే కథ, అప్పట్లో ఒకడు, బ్రోచేవారు, రాజరాజ చోర .. ఈ సినిమాలన్నిటికీ చాల బలంగా చెప్పా. పేపర్ మీద చదివిన కథ..  స్క్రీన్ పైకి సరిగ్గా వచ్చి, ఒక తృప్తిని ఇస్తే నాకు చాలా నిజాయితీగా మాటలు వచ్చేస్తాయి. దిని కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వడం వుండదు. నా సినిమా అనే కాదు .. ఏ సినిమా నచ్చిన ఆ టీంతో అలానే మాట్లాడతాను. నా సినిమా కాబట్టి స్టేజ్ పైన మాట్లాడను. అన్ని వర్గాలా ప్రేక్షకులకు రీచ్ అవ్వాల్సిన సినిమా అల్లూరి. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఒక స్ఫూర్తిని నింపే సినిమా. కంటెంట్ పై చాలా నమ్మకం వుంది. కమర్షియల్ గా ఉంటూనే డిఫరెంట్ గా వుంటుంది. అందుకే  ఇంకాస్త ఎక్కువగా ప్రమోట్ చేయాలనిపించింది. *మీకు ‘ఎఎ’ సెంటిమెంట్ వుందని పప్రిరిలీజ్ ఈవెంట్ లో చెప్పారు కదా.. దాని గురించి ? నిజానికి అది ఎక్కడా చెప్పకూడనదని అనుకున్నాను. కానీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఈవెంట్ కోసం ఈవినింగ్ రెండు గంటల నుండి ఎదురుచూశారు. బన్నీగారి ఫ్యాన్స్ రావడంతో ఆ ఈవెంట్ ని నేనే దగ్గరుండి చూశాను. ఫ్యాన్స్ ని చూసిన తర్వాత అది చెప్పాలనిపించింది. నిజానికి ఎఎ సెంటిమెంట్ నాకు బాగా కలిసొచ్చింది. గాలి సంపత్ మినహా మిగతా అన్నీ సినిమాల్లో ఎఎ సెంటిమెంట్ వుంటుంది. ఇక అల్లూరిలో ‘అల్లు’ రావడం ఇంకా హ్యాపీ( నవ్వుతూ).

సెన్సేషనల్ డైరెక్టర్ వి వి వినాయక్ రిలీజ్ చేసిన ‘పగ పగ పగ’ ట్రైలర్

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా విలన్ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం ‘ *పగ పగ పగ* సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో

తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ‘అహింస’ ఫస్ట్ సింగిల్ ‘నీతోనే నీతోనే’ రిలీజ్

క్రియేటివ్ జీనియస్ తేజ ప్రస్తుతం ‘అహింస’ అనే యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో నూతననటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్

నాగ చైతన్య, వెంకట్ ప్రభు, శ్రీనివాస చిట్టూరి NC 22 షూటింగ్ రేపటి నుండి ప్రారంభం

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి NC22 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. NC22 నాగచైతన్య తొలి

టీజర్ లాంచ్ చేసిన హీరో నితిన్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ చేయండి!

దర్శకుడు మేర్లపాక గాంధీ హిలేరియస్ ఎంటర్‌ టైనర్‌ లను డీల్ చేయడంలో దిట్ట. ఆయన తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కంప్లీట్ ఎంటర్‌ టైనర్. దీంతో పాటు క్రైమ్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యం లో తెలుగు-హిందీ భాషల్లో వరుణ్ తేజ్ 13వ చిత్రం!

సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్-  రెనైసెన్స్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యం లో తెలుగు-హిందీ మూవీ తమ తొలి తెలుగు- హిందీ

తెలుగు తమిళ్ లో డిసెంబర్ 2న ధనుష్ ‘సార్’ వస్తున్నారు!

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో జతకడుతూ

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న మంచు విష్ణు”గోలీ సోడా వే”

డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. భారీ తారాగణం,

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా పాల్గొన్న‘అల్లూరి’ ప్రీరిలీజ్ ఈవెంట్

‘అల్లూరి’ మంచి కంటెంట్ తో వస్తోంది.. అందరూ తప్పకుండా థియేటర్ లో చూడాలి: ‘అల్లూరి’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం

‘ప్రేమదేశం’ మూవీ లో “తెలవారెనే స్వామి” సెకండ్ సింగిల్ సాంగ్ లాంచ్

సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగుణ్, మేఘా ఆకాష్,మాయ, అజయ్ కతుర్వార్, శివ రామచంద్ర, తనికెళ్ళ భరణి, వైవా హర్ష  నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార

విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసిన “రణస్థలి” మూవీ టీజర్

రామానాయుడు స్టూడియోస్ లో  A J ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూరెడ్డి విష్ణుగారి సమర్పణలో  పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో నిర్మించిన “రణస్థలి” సినిమా టీజర్ రిలీజ్ చేసిన సినిమా హీరో వెంకటేష్

‘నేనెవరు?’ ఆడియో & ప్రోమో విడుదల సంబరం

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా… నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనెవరు’. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా

Latest News Updates

Most Read News