డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. భారీ తారాగణం, బడా సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. టీజర్ ని బట్టి చూస్తే ఢీ, దేనికైనా రెడీ తర్వాత విష్ణు కెరీర్ లో ఆ స్థాయి విజయాన్ని అందుకోగల సత్తా ఉన్న సినిమా అనే నమ్మకాన్ని టీజర్ కలిగిస్తోంది.తాజాగా “జిన్నా” మూవీ నుండి సోమవారం సోషల్ మీడియా లో విడుదలైన పెప్పీ డ్యాన్స్ నంబర్ ‘గోలీ సోడా వే’ పాట అభిమానులను ఉర్రూతలూగిస్తుంది.
https://www.youtube.com/watch?v=4-nqmspWsH4
ఈ పాటలో విష్ణు మరియు గ్లామ్ డాల్ పాయల్ రాజ్‌పుత్ ఉన్నారు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన సంగీత సారద్యంలో నకాష్ అజీజ్ మరియు నూతన మోహన్ లు ఈ పాటను పాడారు.
ట్రైలర్‌తో పాటు ఇప్పటికే విడుదలైన రెండు పాటలతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. షూటింగ్ సమయంలో కాలుకు గాయమైనప్పటికీ, అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేయడంతో హీరో విష్ణు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా మంచు లు ఈ చిత్రంతో తొలిసారిగా గాయనిగా పరిచయమవుతున్నారు .స్నేహం మీద సాగే ఫ్రెండ్షిప్ సాంగ్ ఇప్పటికీ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది.సైకాలజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో సునీల్, వెన్నెల కిషోర్ లు కీలక పాత్రల్లో నటించారు.