పంజాబ్ అమృత్‌సర్‌లోని రానియా సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద ఓ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. రానియా ఔట్‌పోస్ట్ సమీపంలో ఆదివారం రాత్రి పాకిస్థాన్ వైపు నుంచి ఒక డ్రోన్ భారత్‌లోకి చొచ్చుకొచ్చింది. గుర్తించిన జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో అది కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఆ ఆక్టా కాపర్ సుమారు 12 కిలోల బరువు ఉన్నదని చెప్పారు. అది ఓ కన్సైన్‌మెంట్ తీసుకురావడాన్ని గుర్తించారు. అయితే అందులో ఏమున్నాయనే విషయాన్ని అధికారులు తెలియ జేయలేదు.
కాగా, మూడు రోజుల క్రితం (అక్టోబర్ 14న) గురుదాస్‌పూర్ సెక్టార్‌లో భద్రతా దళాలు ఓ డ్రోన్‌కు కూల్చివేశారు. శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి భారత్‌లోకి డ్రోన్ రావడాన్ని గుర్తించిన జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో గత తొమ్మిది నెలల్లో పాకిస్థాన్ వైపు నుంచి మొత్తం 193 డ్రోన్లు భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డాయని అధికారులు పేర్కొన్నారు.
पंजाब: BSF ने अमृतसर में पाकिस्तान से आ रहे ड्रोन को नीचे गिराया।
BSF कमांडेंट घनश्याम दास ने बताया, "ड्रोन की गतिविधि काफी बढ़ गई है और जवानों के लिए यह नई चुनौती है। हमारे जवानों ने रात में इस ड्रोन की आवाज़ सुनी और 7 राउंड फायर किए। इससे 2 किलो हेरोइन मिला है।" pic.twitter.com/SLR8YHieSn
— ANI_HindiNews (@AHindinews) October 17, 2022