పలు రాష్ట్రాలకు ఇన్ ఛార్జీ, కో ఇన్ ఛార్జీలను నియమించిన బీజేపీ

బీజేపీ అధిష్ఠానం పలు రాష్ట్రాలకు ఇన్ ఛార్జులను, కో ఇన్ ఛార్జులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న తపనతో వున్న బీజేపీ… ఇన్ ఛార్జీని మార్చలేదు. ప్రస్తుత ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్ నే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. సహ ఇన్ ఛార్జీగా అరవింద్ మీనన్ ను నియమించింది. ఇక… సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు కేరళ, మహేశ్ శర్మకు త్రిపుర బాధ్యతలిచ్చారు. ఇక.. వినోద్ తావడేకు బిహార్, రాజస్థాన్ కు అరుణ్ సింగ్, మధ్యప్రదేశ్ మురళీధర్ రావు కు అప్పగించారు. ఓం మాథుర్ కు ఛత్తీస్ గఢ్ బాధ్యతలిచ్చారు. ఇక… బిహార్ మాజీ మంత్రి మంగళ పాండేకు అత్యంత కీలకమైన బెంగాల్ బాధ్యతలిస్తూ జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం