శాఖ మార్చిన కాసేపటికే రాజీనామా చేసేసిన బిహార్ మంత్రి

2014లో జరిగిన అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌జేడీ నేత, బిహార్‌ మంత్రి కార్తీకేయ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. కాసేపటికే గవర్నర్ తన రాజీనామాను ఆమోదించడం విశేషం. అయితే… కార్తికేయ సింగ్ పై అపహరణ కేసు వుందని, ఆయన్ను శిక్షించాలని, ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్తికేయ సింగ్ ప్రస్తుతం న్యాయ శాఖా మంత్రిగా బాధ్యతల్లో వున్నారు. అయితే… ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను న్యాయ శాఖ నుంచి తొలగించి, అంత ప్రాధాన్యం లేని శాఖను కట్టబెట్టారు. ఇలా అప్రాధాన్యత శాఖను అప్పజెప్పగానే కార్తికేయ సింగ్ తన పదవికి రాజీనామా చేసేశారు.

 

బిహార్‌లో బీజేపీ కూటమి నుండి వైదొలిగిన జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రి వర్గ ఏర్పాటులో భాగంగా కార్తీకేయకు న్యాయ శాఖను కేటాయించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కడంపై నితీష్‌ కుమార్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయినా… సీఎం నితీశ్ కొన్ని రోజుల పాటు ఉపేక్షించారు.

Related Posts

Latest News Updates