గుడ్ న్యూస్…. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్లు

కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు గుడ్ న్యూస్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ 19 కిలోల వాణిజ్య సిలిండరు ధర భారీగా తగ్గింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ 19 కిలోల వాణిజ్య సిలిండరుపై 91.50 రూపాయలను తగ్గిస్తూ…. పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. శ రాజధాని నగరమైన ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 1885 రూపాయలకు తగ్గించారు.కోల్ కతాలో రూ.1995, ముంబయిలో రూ.1844, చెన్నయ్‌లో రూ.2045 ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ధరను తగ్గించారు. 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండరు ధరపై 91.5 రూపాయలు తగ్గించడంతో రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, టీస్టాళ్లకు ఇతరులకు భారీ ఊరట లభించినట్లైంది.

Related Posts