తెలంగాణలో భారత్ జోడో పాదయాత్ర

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టే భారత్‌ జోడో పాదయాత్ర తెలంగాణలోకి అక్టోబర్‌ 24న ప్రవేశిస్తుంది. నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజక వర్గంలో కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి రాహుల్‌ పాదయాత్రతో తెలంగాణలోకి ప్రవేశిస్తారు. నాలుగు పార్లమెంట్‌ నిజయోక వర్గాలు, 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగే ఈ యాత్ర 13 రోజులు లేదా 15 రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గంలో పాదయాత్ర ముగిసి మహారాష్ట్రంలోకి వెళ్లుతుందని కేంద్ర మాజీ మంత్రి, భారత్‌ జోడో యాత్ర తెలంగాణ సమన్వయకర్త బలరామ్‌ నాయక్‌ తెలిపారు. ఈ పాదయాత్ర విషయంలో ఇప్పటికే రూట్‌మ్యాప్‌ పరిశీలన జరిగిందని, రాష్ట్రంలో 350 కిలోమీటర్ల నుంచి 370 కిలోమీటర్ల వరకు పాదయాత్ర ఉండే అవకాశం ఉందని తెలిపారు. రాహుల్‌గాంధీ పాదయాత్రకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates