సాధ్వీ రితింభర పర్యటనను వ్యతిరేకిస్తూ ఇంగ్లాండ్ లో పాకిస్తాన్ ను చెందిన కొన్ని గ్రూపులు తీవ్ర నిరసన వ్యక్తం చేవాయి. బ్రిటన్ లోని బర్మింగ్‌హామ్ లో హిందూ ఆలయం దుర్గాభవన్ పై దాడికి పాల్పడ్డాయి. సాధ్వీ రితింభర ముస్లిం వ్యతిరేకి అని, బాబ్రీ మసీదు కూల్చి వేతలో ప్రధాన సూత్రధారి అని ముస్లిం సంఘాలు నిందించారు. ఆమె పర్యటనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే… సాధ్వీ రితింభరకు ఆరోగ్యం బాగో లేదని, ఆమె పర్యటన రద్దైందని ప్రకటించినా… ముస్లింలు తమ నిరసన ఆపలేదు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని పిలుపునిచ్చి, భారీగా ఆందోళన చేయడంతో హింసాత్మకంగా మారిపోయింది.
మరోవైపు గత నెల 28 న భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా లీసెస్టర్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు కూడా జరిగాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘర్షణల నేపథ్యంలో హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ బుధవారం బ్రిటన్ ప్రధానమంత్రి లిజ్ ట్రస్‌కు లేఖ రాశారు. హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నా, అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని ఆయన విమర్శించారు.