ప్రభాస్ ఆత్మ బంధువు అనుశ్క శెట్టి తాజాగా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసింది. కృష్ణంరాజుతో ఉన్న ఎమోషనల్ బంధాన్ని గుర్తు చేసే విధంగా ఫోటోను షేర్ చేసింది. ఇక కృష్ణంరాజు మరణం పట్ల టాలీవుడ్ మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరోలైనా చిరంజీవి, బాలయ్య, కృష్ణ ఇలా అందరూ కూడా సంతాపాన్ని ప్రకటించారు. ప్రభాస్‌కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతి పట్ల సినీ లోకం దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులంతా కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క శెట్టి వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. కృష్ణంరాజుతో స్వీటికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ విషయాన్ని తెలియజేసేలా అనుష్క ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో అనుష్కను ప్రేమగా హత్తుకున్నాడు కృష్ణంరాజు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి.. ఎంతో మంచి మనసు.. పెద్ద మనసు ఉన్న కృష్ణంరాజు గారు నిజమైన లెజెండ్.. మా గుండెల్లో ఎప్పటికీ మీరు కొలువై ఉంటారు.. అంటూ అనుష్క ఎమోషనల్ అయింది.
https://www.instagram.com/p/CiWeaWuPdWG/