తెలుగు చిత్ర సీమకు చెందిన సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూశారు. జూబ్లీ హిల్స్‌లోని ఆయన నివాసంలో సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. హీరో మహేష్, త్రివిక్రమ్.. కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించి , ప్రభాస్‌ని ఓదార్చారు.
అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీర్, మహేష్ మంచు విష్ణు వారంతా కూడా కృష్ణంరాజు మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. ఇక మంచు విష్ణు అయితే ఏకంగా తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్నే మార్చేశాడు. తన ఇంటి పెద్దను కోల్పోయినంత బాధగా ఉందంటూ మంచు విష్ణు వేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా అల్లు అర్జున్ ట్వీట్ వేస్తూ.. ‘శ్రీ కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని అన్నాడు. మోహన్ బాబు స్పందిస్తూ.. మాటలు రావడం లేదు.. నా సోదరుడిని కోల్పోయాను అని ట్వీట్ వేశాడు. ఇక మంచు విష్ణు అయితే ఏకంగా ప్రొఫైల్ పిక్‌ను షేర్ చేశాడు. మా ఇంటి పెద్దను కోల్పోయాం.. గుండె బద్దలైనట్టుగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యాడు మంచు విష్ణు. ఎన్టీఆర్ ట్వీట్ వేస్తూ.. కృష్ణంరాజు గారి మరణం నాకు ఎంతో బాధను కల్గించింది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను అని అన్నాడు. మహేష్ బాబు స్పందిస్తూ.. కృష్ణంరాజు గారి లేరనే వార్త తెలిసి ఆశ్చర్యానికి గురయ్యాను.. ఈరోజు నాకు, ఇండస్ట్రీకి దుర్దినం.. ఆయన సినిమా రంగానికి చేసిన సేవ, కృషి ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ క్లిష్ట కాలంలో ప్రభాస్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు.
https://twitter.com/urstrulyMahesh/status/1568818284920999937
Deeply saddened by Krishnam Raju Garu's passing away. I extend my heartfelt condolences to his family. May his soul rest in peace…
— Jr NTR (@tarak9999) September 11, 2022
Extremely saddened to learn about the sudden passing of Krishnam Raju garu. His contribution to the film industry was immense. My deepest condolences to his family, friends & fans . May his soul rest in peace.
— Allu Arjun (@alluarjun) September 11, 2022
#NewProfilePic pic.twitter.com/XaVF5hGhug
— Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022