వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న సంతోష్ శోభన్, నందిని రెడ్డి , స్వప్న సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అన్నీ మంచి శకునములే’ కోసం జతకట్టారు. టైటిల్ కి తగ్గట్టే సిననిమాపై మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో యూనిట్ ప్రమోషన్స్‌ను ప్రారంభిచింది. ‘అన్నీ మంచి శకునములే’ డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకి క్రిస్మస్ వీకెండ్ పెద్ద అడ్వాంటేజ్ అవ్వనుంది. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ జోడిగా మాళవిక నాయర్ కనిపించనుంది. ప్రియాంక దత్ , మిత్ర విందా మూవీస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దావూద్ స్క్రీన్ ప్లే అందించగా, లక్ష్మీ భూపాల మాటలు రచయిత. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి తదితరులు. సాంకేతిక విభాగం: దర్శకత్వం: నందిని రెడ్డి నిర్మాత: ప్రియాంక దత్ బ్యానర్లు: స్వప్న సినిమా , మిత్ర విందా మూవీస్ సంగీతం: మిక్కీ జె మేయర్ డీవోపీ: సన్నీ కూరపాటి డైలాగ్ రైటర్: లక్ష్మీ భూపాల కాస్ట్యూమ్ స్టైలిస్ట్: పల్లవి సింగ్ స్క్రీన్ ప్లే రైటర్: దావూద్ ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావు పీఆర్వో వంశీ శేఖర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్