‘ది ఘోస్ట్ ‘ఆడియన్స్ చాలా కొత్తదనం ఫీలౌతారు : కింగ్ నాగార్జున

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో కింగ్ నాగార్జున విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు
*ది ఘోస్ట్ లో తమహగనే వెపన్ ప్రమోషన్స్ లో ఆకట్టుకుంది. దిని వెనుక కథ వుందా ?
తమహగనే వెనుక ఒక బ్యాక్ స్టొరీ వుంది, ఈ సినిమాలో వుండదు కానీ తమహగనే వెపన్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ చెప్పాడు దర్శకుడు ప్రవీణ్. అది నచ్చి దాన్ని గ్లింప్స్ గా వదిలాం. ఈ సినిమా విజయం సాధిస్తే ఆ బ్యాక్ స్టొరీ కూడా చూపిస్తాం. (నవ్వుతూ)
*ది ఘోస్ట్ పై చాలా ఇష్టం చూపిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.. అంత పెరగడానికి కారణం ?
ది ఘోస్ట్ కథలో చక్కని ఫ్యామిలీ లైన్ వుంది. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బావుంటుంది, తన సిస్టర్, ఫ్యామిలీని కాపాడటానికి హీరో చేసే పోరాటం చాలా నచ్చింది. నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతాను. ప్రవీణ్ సత్తారు ఈ కథని చాలా కొత్తగా ప్రజంట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లు, బ్రదర్ సిస్టర్ బాండ్ ని అద్భుతంగా చూపించారు. సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యాను. ప్రవీణ్ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. చాలా ఇంప్రస్ అయ్యాను. ఒక యాక్షన్ మూవీ లో ఎమోషన్ ఈ స్థాయిలో పండటం నాకే షాక్ అనిపించింది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి బయటికి వచ్చినపుడు యాక్షన్ విషయంలో ఒక షాక్ ఫీలౌతారు. సినిమా చాలా కొత్తగా వుంటుంది. ఇందులో క్లైమాక్స్ చర్చ్ ఫైట్ ఒక మెయిన్ హైలెట్.
*ది ఘోస్ట్ ని శివతో పోల్చడానికి కారణం ?
నిజానికి ఈ సినిమా కథ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ పోలిక రాలేదు. సినిమా చూస్తున్నపుడు మాత్రం శివ లాంటి ఫ్యామిలీ ఎమోషన్ వుందనిపించింది.
*ది ఘోస్ట్ కథని ఎంచుకోవడానికి కారణం ?
నేను చాలా యాక్షన్ మూవీస్ చేశాను. కానీ ఎమోషన్ తో కూడిన ఒక స్టయిలీష్ యాక్షన్ సినిమా చేయాలని వుండేది. గరుడ వేగ లో ప్రవీణ్ సత్తారు యాక్షన్ చాల నచ్చింది. ప్రవీణ్ ని పిలిచి మంచి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పాను. అప్పుడు నన్ను మైండ్ లో పెట్టుకొని ది ఘోస్ట్ కథని తయారు చేసారు. ఈ సినిమాలో యాక్షన్ కోసం మూడు వారాల శిక్షణ కూడా తీసుకున్నాం.
*ట్రైలర్ లో అన్ని రోమాన్స్ , సాంగ్స్ , యాక్షన్ ఎలిమెంట్స్ చూపించారు ? ఇన్ని ఎలిమెంట్స్ తో కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ?
ఇందులో వున్న బ్యూటీ అదే. అన్ని ఎమోషన్స్ చక్కగా కుదిరాయి.హీరోయిన్ పాత్ర కూడా చాలా పరిణితితో వుంటుంది. హీరో హీరోయిన్ మధ్య రిలేషన్ చాలా కొత్తగా వుంటుంది.
*ప్రమోషన్స్ ని చాలా ఇష్టంగా చేస్తున్నట్లు కనిపిస్తోంది ?
సినిమాకి ప్రమోషన్స్ చాలా అవసరం. ఒక సినిమా చేసిన తర్వాత ఇదీ మా సినిమా అని చెప్పుకోవడం అందరికీ అవసరం. సినిమా విడుదలైన తర్వాత అంతా ఇంక ప్రేక్షకుల చేతుల్లో వుంటుంది.
*మీరు చిరంజీవి గారి సినిమాలు ఒకే రోజు వస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారనిపిస్తుంది ?
మేము మంచి స్నేహితులం. రెండు సినిమాలు విడుదలై విజయం సాధించిన సందర్భాలు అనేకం వున్నాయి. సినిమా బావుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. శివ సినిమా అక్టోబర్ 5నే వచ్చింది. నిన్నే పెళ్ళాడుతా అక్టోబర్ 4న వచ్చిందని ఒక అభిమాని ఫోన్ చేసి చెప్పారు. ది ఘోస్ట్ అక్టోబర్ 4నే యుఎస్ లోరిలీజ్ అవుతుంది. ఈ రకంగా నిన్నే పెళ్ళాడుతా సెంటిమెంట్ కూడా కుదిరింది (నవ్వుతూ).
*పాత సినిమాలని కొత్తగా రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తుంది.. శివ సినిమా మళ్ళీ వస్తుందా ?
తప్పకుండా. శివ సినిమాని 4కే డిజిటల్ చేస్తున్నాం. అదే కాదు అన్ని సినిమాలు డిజిటల్ చేయాలి. కొన్ని నెగిటివ్ లు పాడయ్యాయి. ప్రస్తుతం దానికి సంబధించిన పనులు జరుగుతున్నాయి.
*ది ఘోస్ట్ నటీనటులు కొత్త వారు కనిపిస్తున్నారు కదా ?
పాత్రలకు తగ్గట్టె నటీనటులు ఎంపిక చేశాం. కొత్త విజువల్ కనపడాలని ప్రయత్నం చేశాం.
*మీరు బాలీవుడ్ లో చేస్తున్నారు.. సల్మాన్ ఖాన్ లాంటి నటులు ఇక్కడ సినిమాలు చేస్తున్నారు.. బౌండరీలు చేరిగిపోయాయని అనుకోవచ్చా ?
ఇప్పుడు బౌండరీలు లేవు. యుఎస్ లో ఐమాక్స్ స్క్రీన్ లో ఆర్ఆర్ఆర్ వచ్చిన రెస్పాన్స్ వీడియో చూస్తే దేశంలోనే కాదు ప్రపంచ సరిహద్దులు కూడా చెరిగిపోయాయని అనిపించింది. బ్రహ్మాస్త్ర లో నేను చేసిన పాత్రకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
*ది ఘోస్ట్ టెక్నికల్ టీం గురించి చెప్పండి ?
అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ వున్న చిత్రమిది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెబుతారు. శివలో సౌండ్ డిజైన్ గురించి ఎంతలా మాట్లాడుకున్నారో ది ఘోస్ట్ టెక్నికల్ వాల్యూస్ గురించి కూడా అంత గొప్పగా మాట్లాడుకుంటారు.
*దర్శకుడు ప్రవీణ్ సత్తారు గురించి ?
ప్రవీణ్ చాలా క్లియర్ విజన్ వున్న దర్శకుడు. తన హోమ్ వర్క్ కి చాలా టైం తీసుకుంటాడు. అయితే అతను చేసే ప్రీ ప్రొడక్షన్ చక్కగా వుంటుంది. ఆయన చేసిన ప్రీ ప్రొడక్షన్ కారణంగా ఈ సినిమా 66రోజుల్లోనే పూర్తయింది.
*కొత్తగా చేయబోయే సినిమాలు ?
రెండు మూడు కథలు చర్చలో వున్నాయి. యాక్షన్ డ్రామా జోనర్ లో వుంటాయి. అలాగే వెబ్ సిరిస్ చర్చలు కూడా నడుస్తున్నా

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం